నా జీవితంలో చీకటి రోజు.. మిథాలీ రాజ్

0
191

Times of Nellore (Mumbai) # కోట సునీల్ కుమార్‌# – మహిళా క్రికెట్ జట్టు కోచ్ రమేశ్ పొవార్ తనపై చేసిన విమర్శలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు టీమిండియా మహిళల స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్. తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలకు తీవ్రంగా కలత చెందానని ట్వీట్ చేశారు. ఆటపట్ల నిబద్ధతతో.. 20 ఏళ్లపాటు దేశం కోసం ఆడానని.. కానీ తన శ్రమ నిష్ఫలమైందన్నారు. ఇవాళ తన దేశభక్తిని శంకిస్తూ.. క్రీడా నైపుణ్యతను ప్రశ్నిస్తున్నారని ఆవేదన చెందారు. బురద జల్లుతున్నారని.. ఇది తన జీవితంలోనే చీకటి రోజుని ట్వీట్ చేశారు. ఆ దైవం తనకు మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు.

SHARE

LEAVE A REPLY