సంచలనం: ప్రపంచ చెస్ చాంపియన్ గా మన కోనేరు హంపి

0
244

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ – తెలుగమ్మాయి కోనేరు హంపి ప్రపంచ చదరంగ వేదికపై మరో అద్భుత విజయం సాధించింది. ఇటీవలే మొనాకో గ్రాండ్ ప్రి చెస్ టైటిల్ గెలుచుకున్న హంపి మరో మెగా టైటిల్ ఖాతాలో వేసుకుంది. తొలిసారి ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్ గా నిలిచింది. శనివారం ముగిసిన ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్ షిప్ లో ఆమె.. ప్లేఆఫ్స్ లో చైనా గ్రాండ్ మాస్టర్ లీ టింగ్ జీని ఓడించి టైటిల్ అందుకుంది. హంపికి ఇదే తొలి ప్రపంచ టైటిల్ . భారత్ తరఫున మహిళల విభాగంలోనూ ఇదే తొలి ప్రపంచ టైటిల్ .

12 రౌండ్ల ఈ టోర్నీలో ఆఖరి రౌండ్ తర్వాత హంపి 9 పాయింట్లతో చైనా గ్రాండ్ మాస్టర్ లీ టింగ్ జీ, టర్కీ క్రీడాకారిణి ఎక్తరీనాతో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచింది. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా స్వర్ణం కోసం పోరాడే అవకాశం హంపి, లీ టింగ్ జీలకు దక్కింది. ప్లేఆఫ్స్ కూడా అంత త్వరగా తేలలేదు. హంపి, లీ టింగ్ జీ హోరాహోరీ పోరాడడంతో తొలి ప్లేఆఫ్స్ కూడా డ్రాగా ముగిసింది. రెండో ప్లేఆఫ్స్ అనివార్యమైంది.

రెండో ప్లేఆఫ్స్ లో హంపి దూకుడుగా ఆడి లీ టింగ్ జీని మట్టికరిపించింది. మరో గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక 8 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది.

SHARE

LEAVE A REPLY