నేడు మీడియా ముందుకు కోహ్లీ!

0
197

Times of Nellore -✒కోట సునీల్ కుమార్✒– వెస్టిండీస్ పర్యటన ముందు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మీడియా సమావేశానికి హాజరవుతున్నట్లు బీసీసీఐ పేర్కొంది. మీడియా సమావేశానికి కోహ్లీ దూరంగా ఉంటాడని గుసగుసలు వినిపించిన సంగతి తెలిసిందే. కోహ్లీ, భారత ఉప సారథి రోహిత్‌ శర్మ మధ్య విభేదాల కారణంగా సమావేశం నిర్వహించరని వార్తలు వచ్చాయి. కానీ మీడియా సమావేశం జరుగుతుందని, దీనికి కోహ్లీ హాజరవుతున్నట్లుగా బీసీసీఐ ధ్రువీకరించింది. జట్టు ఏదైనా పర్యటనకు వెళ్లే ముందు మీడియా సమావేశాలు నిర్వహించడం సర్వసాధారణం. కోచ్‌, కెప్టెన్‌.. పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తారు.

ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఓటమి అనంతరం కోహ్లీ-రోహిత్‌ విభేదాలపై ఎన్నో వార్తలు వచ్చాయి. దీన్ని బీసీసీఐ పాలకుల కమిటీ అధినేత వినోద్‌ రాయ్‌ కొట్టిపారేశారు. అవన్నీ మీడియా సృష్టేనని తెలిపారు. అయినా దీనిపై కోహ్లీ, రోహిత్‌ స్పందించకపోవడం, రోహిత్‌.. కోహ్లీ, అనుష్కను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడంతో వార్తలు వస్తూనే ఉన్నాయి. వెస్టిండీస్ పర్యటనకు టీమిండియా నేడు ముంబయి విమానశ్రయం నుంచి బయలుదేరనుంది. మీడియా సమావేశం సాయంత్రం ఉండవచ్చిని బీసీసీఐ తెలిపింది. దీంతో కోహ్లీ-రోహిత్‌పై వస్తున్న విభేదాల వార్తలకు ముగింపు లభిస్తుందని అందరూ భావిస్తున్నారు. వెస్టిండీస్‌తో భారత్‌ మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల్లో తలపడనుంది. తొలి రెండు టీ20లు యూఎస్‌లో జరగనున్నాయి. మిగిలిన మ్యాచులన్నీ వెస్టిండీస్‌లో జరుగుతాయి

SHARE

LEAVE A REPLY