సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ..!

0
193

Times of Nellore (Visakha) – కోట సునీల్ కుమార్: వెస్టిండీస్‌తో ఇక్కడ జరుగుతున్న రెండో వన్డేలో టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 10 వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. వన్డే చరిత్రలో 10000 పరుగులు చేసిన అయిదవ ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఆటగాళ్లలో కోహ్లీ 13వ ఆటగాడిగానూ, భారత ఆటగాళ్లలో 4వ ఆటగాడిగానూ చోటు సంపాదించుకున్నాడు. అంతకు ముందు ఈ ఫీట్ సాధించిన భారత ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ ఈ ఫీట్ సాధించిన ఆటగాళ్లలో ఉన్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఈ ఫీట్‌ను 463 మ్యాచ్‌లలో సాధించగా…అయితే కోహ్లీ మాత్రం కేవలం 213 మ్యాచ్‌లలోనే ఈ ఫీట్ సాధించి, సచిన్ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. అంతే కాకుండా అతి తక్కువ మ్యాచ్‌లలో ఈ ఘనత సాధించిన మొదటి వ్యక్తి కూడా విరాట్ కోహ్లీనే కావడం మరో విశేషం.

SHARE

LEAVE A REPLY