కోహ్లీ ఖాతాలోకి మరో వరస్ట్ రికార్డు

0
56

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటేనే సెంచరీలకు కేర్ ఆఫ్ అడ్రెస్.. ఫార్మాట్ ఏదైనా శతకం బాదాల్సిందే. అలాంటి రన్ మిషన్ ఖాతాలో ఓ చెత్త రికార్డు నమోదైంది. గత 19 ఇన్నింగ్స్‌లో అతడు ఒక్క శతకం కూడా సాధించకపోవడం గమనార్హం. కివీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో విరాట్ కేవలం రెండు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌తో కలిపి గత 19 ఇన్నింగ్స్‌లో అతడు మూడంకెల స్కోర్ దాటలేదు. కోహ్లీ కెరీర్‌లో ఇలా జరగడం ఇది మూడోసారి.

కెప్టెన్‌గా అతడు బాధ్యతలు తీసుకున్న మొదటిసారి 2011 ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్‌ వరకు వరుసగా 24 ఇన్నింగ్స్‌ల్లో శతకం నమోదు చేయలేదు.. ఆ తర్వాత 2014 ఫిబ్రవరి నుంచి అక్టోబర్‌ వరకు వరుసగా 25 ఇన్నింగ్స్‌ల్లో.. ఇక లేటెస్ట్‌గా 19 ఇన్నింగ్స్‌లో సెంచరీ నమోదు చేయకుండానే ఈ పరుగుల ధీరుడు వెనుదిరిగాడు.

ఇదిలా ఉంటే 2014 ఇంగ్లాండ్ పర్యటనలో విరాట్ కోహ్లీ పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే. అప్పుడు అతడి బ్యాటింగ్ శైలిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ప్రస్తుతం కివీస్ పర్యటనలో కోహ్లీ మూడు ఫార్మాట్లు కలిపి 8 ఇన్నింగ్స్ మాత్రమే ఆడాడు. అందులో కేవలం ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే ఉంది.

SHARE

LEAVE A REPLY