శ్రేయస్ అయ్యర్కు జరిమానా!!

0
65

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒-ఐపీఎల్‌-13లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు మరో షాక్‌ తగిలింది. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు జరిమానా విధించారు. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మొదట బ్యాటింగ్‌ చేయగా, ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలింగ్‌ నిర్ణీత సమయంలో ముగియలేదు. కనీస ఓవర్‌రేట్‌ తప్పిదం కారణంగా ఐపీఎల్‌ నియమావళి ప్రకారం జట్టు సారథి అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా విధించినట్టు ఐపీఎల్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వార్నర్‌ సేన 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో తడబడ్డ ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 147 పరుగులకే పరిమితమైంది.

SHARE

LEAVE A REPLY