ఇషాన్ కిషన్ సూపర్ ఓవర్ ఆడడానికి ఎందుకు రాలేదో చెప్పిన రోహిత్..!

0
77

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- సూపర్‌ ఓవర్‌లో ముంబై ఇండియన్స్‌ వికెట్‌ కోల్పోయి 7 పరుగులే చేసింది. ముంబై తరఫున హార్దిక్‌ పాండ్యా, పొలార్డ్‌లు ఓపెనింగ్‌కు దిగారు. సైనీ వేసిన సూపర్‌ ఓవర్‌ తొలి బంతికి పొలార్డ్‌ పరుగు తీయగా, రెండో బంతికి పాండ్యా మరో పరుగు సాధించాడు. మూడు బంతికి ఎటువంటి పరుగు రాలేదు. నాల్గో బంతికి పొలార్డ్‌ ఫోర్‌ కొట్టగా, ఐదో బంతికి ఔటయ్యాడు. ఆరో బంతికి బై రూపంలో పరుగు రావడంతో ఆర్సీబీకి ముంబై ఎనిమిది పరుగుల టార్గెట్ ఇచ్చింది.

ముంబై తరఫున బుమ్రా సూపర్‌ ఓవర్‌ వేయగా, ఆర్సీబీ తరఫున ఏబీ డివిలియర్స్‌, విరాట్‌ కోహ్లిలు ఓపెనింగ్‌కు వచ్చారు. మొదటి రెండు బంతులు.. ఒక్కో పరుగు తీయగా.. మూడో బంతి డాట్ బాల్ అయింది. బుమ్రా మ్యాజిక్ చూడొచ్చని భావించగా.. నాలుగో బంతిని ఫోర్ కొట్టాడు ఏబీడీ.. ఐదో బంతి కాస్తా సింగిల్ తీయగా.. ఆఖరి బంతికి కోహ్లీ ఫోర్ కొట్టడంతో బెంగళూరు విజయాన్ని అందుకుంది.

ఈ మ్యాచ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్ ముంబై తరపున సూపర్ ఓవర్ ఆడడానికి రాలేదు. అందుకు కారణాన్ని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం వివరించాడు. ఇషాన్ కిషన్ అప్పటికే అలసిపోయాడని వెల్లడించాడు రోహిత్. రోహిత్ మాట్లాడుతూ ‘మ్యాచ్ ఎంతో అద్భుతంగా సాగింది. మా ఇన్నింగ్స్ మొదట్లో మ్యాచ్ అసలు మా చేతుల్లోనే లేదు. ఇషాన్ కిషన్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. ఎప్పటిలాగే పొలార్డ్ కూడా మంచి ఇన్నింగ్స్ ను ఆడాడు. పొలార్డ్ క్రీజులో ఉన్నంత వరకూ ఎలాంటి మ్యాచ్ అయినా గెలవగలం. ఇషాన్ కూడా మంచి షాట్స్ ఆడుతూ వెళ్ళాడు. ఇషాన్ ఒత్తిడిని అధిగమిస్తూ ఆడుతూ వచ్చాడు. కిషన్ అలసిపోయినందుకే సూపర్ ఓవర్ ఆడడానికి రాలేకపోయాడు. హార్దిక్ మీద నమ్మకంతోనే సూపర్ ఓవర్ ఆడడానికి పంపించాం’ అని చెప్పుకొచ్చాడు.

 

SHARE

LEAVE A REPLY