ఇంగ్లాండ్‌ 89/5: చెలరేగిన హోల్డర్‌, గాబ్రియేల్‌

0
92

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- బయోసెక్యూర్‌ వాతావరణంలో ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లిష్‌ జట్టు 40 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌ (14; 51 బంతుల్లో 3×4) నిలిచాడు. కరీబియన్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటున్నాడు. అతడికి జోస్‌ బట్లర్‌ (1; 5 బంతుల్లో) తోడుగా ఉన్నాడు.

ఓవర్‌నైట్‌ స్కోరు 35/1తో రెండో రోజు బ్యాటింగ్‌ ఆరంభించిన ఇంగ్లాండ్‌ కాసేపటికే జో డెన్లీ (18; 58 బంతుల్లో 4×4) వికెట్‌ చేజార్చుకుంది. 23.2వ బంతికి అతడిని షానన్‌ గాబ్రియేల్‌ బోల్తా కొట్టించాడు. క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. నిలకడగా ఆడుతున్న ఓపెనర్‌ రోరీ బర్న్స్‌ (30; 85 బంతుల్లో 4×4)ను సైతం అతడే వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత విండీస్‌ కెప్టెన్ హోల్డర్‌ వికెట్ల పతనం మొదలుపెట్టాడు. జాక్‌ క్రాలీ (10; 26 బంతుల్లో 2×4), ఒలివ్‌ పోప్‌ (12; 13 బంతుల్లో 2×4)ను పెవిలియన్‌ పంపించాడు. అల్జారి జోసెఫ్‌, కెమర్‌ రోచ్‌ పరుగులను నియంత్రించారు.

SHARE

LEAVE A REPLY