అటా.. ఇటా.. ఇండియా స్థానం తేలేది నేడే..!

0
129

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ – ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ భారత్ తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. శ్రీలంకతో లీడ్స్‌లో జరగనున్న నామమాత్రపు మ్యాచ్‌లో కోహ్లి సేన పలు ప్రయోగాలు చేసే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా.. డబ్ల్యూసీలో లీగ్ దశ నేటితో ముగుస్తుంది. ప్రస్తుతం.. టీమిండియా 13 పాయింట్స్‌తో ఉంది. ఈరోజు ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్‌తో పాటు, ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్‌ ఆడనుంది. ఒక వేళ ఈ మ్యాచ్‌లో ఇండియా గెలిచి, ఆస్ట్రేలియా ఓడిపోతే 14 పాయింట్స్‌తో భారత్ జట్టు టాప్‌లో ఉంటుంది. ఇలా జరిగితే సెమీస్‌లో భారత్.. న్యూజిలాండ్‌తో, ఒకవేళ జరగకపోతే ఇంగ్లాండ్‌తో తలపడుతుంది. చూడాలి మరి ఏం జరగనుందో. ఇండియా ఎవరితో ఫైనల్‌కు చేరుకోనుందో..!

SHARE

LEAVE A REPLY