పాత జట్టు కాదు టీమ్‌ఇండియా ఫైనల్‌ చేరగలదు

0
26

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరుకొనే సత్తా టీమ్‌ఇండియాకు ఉందని ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ బ్రెట్‌ లీ అన్నాడు. మునుపెన్నడూ చూడనంత భిన్నంగా ప్రస్తుత జట్టు ఉందని పేర్కొన్నారు. యువ డ్యాషింగ్‌ ఓపెనర్‌ షెఫాలీ వర్మ సెమీస్‌లో భారీ స్కోరు చేసే అవకాశం లేకపోలేదని ధీమా వ్యక్తం చేశాడు. షెఫాలీతో పాటు ఈ టోర్నీలో పూనమ్‌ యాదవ్‌ మ్యాచ్‌ విజేతగా అవతరించింది. హర్మన్‌ప్రీత్‌ సేన నాలుగు విజయాలతో గ్రూప్‌-ఏలో అగ్రస్థానంలో నిలవడంలో వీరిద్దరి పాత్ర ఎంతో ఉంది.

‘టీమ్‌ఇండియా ఎప్పుడూ ఫైనల్‌ చేరుకోలేదు. కానీ మునుపెన్నడూ చూడని విధంగా ఇప్పుడా జట్టుంది. బ్యాటు, బంతితో నిలకడగా రాణించే సీనియర్లతో పాటు మ్యాచు విజేతలైన షెఫాలీ, పూనమ్‌తో మంచి కూర్పు లభించింది. ఆ జట్టులో కొందరు అద్భుతమైన క్రికెటర్లు ఉన్నారని మనకు ఇంతకుముందే తెలుసు. చిన్నచిన్న లోపాలను పూరిస్తూ, సీనియర్లకు సహకరించే అమ్మాయిలూ ఇప్పుడు హర్మన్‌సేనలో ఉన్నారు’ అని లీ తెలిపాడు.

‘హర్మన్‌ సేన సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఫైనల్‌ చేరుకుంటుంది. వారిని అడ్డుకోవాలంటే ప్రత్యర్థి అద్భుతమైన జట్టై ఉండాలి. టాప్‌ ఆర్డర్లో షెఫాలీ వర్మకు తిరుగులేదు. భారత బ్యాటింగ్‌కు ఆమె నిర్భయత్వం చేకూర్చింది. అర్ధశతకం చేయనప్పటికీ ఆమె ఇంకా విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడగలదు. ఆమె ఆటను చూడటం అభిమానులకు ఉత్కంఠగా, బౌలర్లకు ఆందోళనకరంగా అనిపిస్తుంది. తొలి మ్యాచులో ఆసీస్‌ను టీమ్‌ఇండియా ఎలా ఓడించిందో మనం చూశాం. అలాంటి జట్టు గ్రూప్‌-ఏలో అగ్రస్థానంలో నిలవడంలో ఆశ్చర్యమేమీ లేదు’ అని బ్రెట్‌లీ పేర్కొన్నాడు.

SHARE

LEAVE A REPLY