ఫ్యూచర్ కప్ క్రికెట్ పోటీలు

0
261

Times of Nellore (Venkatagiri) # కోట సునీల్ కుమార్ # – వెంకటగిరిలో జరుగుతున్న ఎస్ మోహన్ కృష్ణ మెమోరియల్ అండర్ 12 ఫ్యూచర్ కప్ అంతర్ జిల్లా సౌత్ జోన్ క్రికెట్ పోటీలు నాలుగోరోజు కొనసాగాయి. నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అద్వర్యం లో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ లో గురువారం చిత్తూరు – కడప ,నెల్లూరు – కర్నూల్ జట్ల మధ్య పోటీలు జరిగాయి.

చిత్తూర్ – కడప మధ్య జరిగిన మ్యాచ్ లో చిత్తూర్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 24 . 2 ఓవర్లలో కేవలం 62 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఈ జట్టులో ఎన్ సాయి చరణ్ 21 పరుగులు చేసాడు. 63 పరుగుల విజయ లక్ష్యం తో బరిలో దిగిన కడప జట్టు కేవలం 9 .2 ఓవర్లలో విజయాన్ని కైవసం చేసుకుంది. కడప జట్టులో అష్రాఫ్ 3 వికెట్లు తీయగా, ప్రనీల్ రెడ్డి 32, గురు విగ్నేష్ 24 పరుగులతో అజేయంగా నిలిచారు.

నెల్లూరు, కర్నూల్ జట్లమధ్య జరిగిన మ్యాచ్ లో నెల్లూరు జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కర్నూల్ జట్టు నిర్ణీత 25 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. ఎస్ రాహుల్ -51 పరుగులతో అజేయంగా నిలవగా, బి లక్ష్మి గణేష్ 24 పరుగులు చేసాడు. 97 పరుగుల విజయ లక్ష్యం తో బరిలో దిగిన నెల్లూరు జట్టు 24 .1 ఓవర్లలో 5 వికెట్లు నస్టపోయి విజయ లక్షాన్ని చేరుకుంది. నెల్లూరు జట్టులో సి గౌతమ్ కుమార్ 21 పరుగులు చేయగా సి హెచ్ ఎన్ సాయినాధ రెడ్డి -2 ,పి చైతన్య తేజ 2 వికెట్లు పడగొట్టారు.

అంపైర్లు గా పి చిట్టిబాబు ,ఎం రాంగోపాల్, సి డి శ్రీనివాస్,పి హాసన్ షా, స్కోరర్ లుగా నీలాకుమార్ నాయుడు, సద్దాం హుస్సేన్ వ్యవహరించారు. రేపటితో ముగియనున్నఈ పోటీలలో
అన్ని మ్యాచ్ లు పూర్తి చేసుకున్న కడప జట్టు 16 పాయింట్లతో అగ్రస్థానం లో నిలిచింది. నెల్లూరు,అనంతపూర్ జట్లు 8 పాయింట్లతో రెండవస్థానం లో ఉన్నాయి.చిత్తూరు,కర్నూల్ జట్లు 0 పాయింట్లతో చివరి స్తానం లో ఉన్నాయి.

SHARE

LEAVE A REPLY