ఫ్యూచర్ కప్ క్రికెట్ పోటీలు

0
138

Times of Nellore (venkatagiri) # కోట సునీల్ కుమార్ # – వెంకటగిరిలో జరుగుతున్న ఎస్ మోహన్ కృష్ణ మెమోరియల్ అండర్ 12 ఫ్యూచర్ కప్ అంతర్ జిల్లా సౌత్ జోన్ క్రికెట్ పోటీలు మూడోరోజు కొనసాగాయి. నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అద్వర్యం లో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ లో కడప -కర్నూల్ , చిత్తూర్ – అనంతపూర్ జట్లమధ్య పోటీలు జరిగాయి. కడప – కర్నూల్ మధ్య జరిగిన పోటీలోఎం కడప జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కడప జట్టు నిర్ణీత 25 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 145 పరుగులు సాధించింది. పి ఆదిత్య అత్యధికంగా 50 పరుగులతో అజేయంగా నిలవడమేకాక కీలకమైన రెండు వికెట్లు పడగొట్టి కడప జట్టు విజయం లో కీలక పాత్ర వహించాడు. అనంతరం
146 పరుగుల లక్ష్యం తో బరిలో దిగిన కర్నూల్ జట్టు 25 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 87 పరుగులు మాత్రమే చేయగలిగింది.

చిత్తూర్ – అనంతపూర్ జట్ల మధ్య జరిగిన పోటీలో చిత్తూర్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 25 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 74 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎస్ వేదాంత్ 23 పరుగులు సాధించాడు. 75 పరుగుల విజయ లక్ష్యం తో బరిలో దిగిన అనంతపూర్ జట్టు 16 .1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని కైవసం చేసుకుంది. అనంతపూర్ జట్టులో పి మన్ దీప్ – 33 పరుగులతో అజేయంగా నిలిచి, 5 వికెట్లు పడగొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. ఎస్ సాత్విక్ 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. పై మ్యాచ్ లకు అంపైర్ లుగా పి చిట్టిబాబు, ఎం రామ్ గోపాల్,సి డి శ్రీనివాస్,పి హాసన్ షా, స్కోరర్ లు గ లీలాకుమార్, సద్దాం హుస్సేన్ లు వ్యవహరించారు.

మంగళవారం జరిగిన మ్యాచ్ లలో అనంతపురం పై కడప, చిత్తూర్ పై నెల్లూరం విజయం సాధించాయి

SHARE

LEAVE A REPLY