సీఏసీకి కపిల్‌దేవ్‌ రాజీనామా!

0
129

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ బీసీసీఐ క్రికెట్‌ సలహా కమిటి(సీఏసీ) చీఫ్‌ పదవికి బుధవారం రాజీనామా చేశారు. ఈ మేరకు సుప్రీమ్‌కోర్టు నియమించిన క్రికెట్‌ పాలక మండలికి ఆయన ఈ మేరకు ఈమెయిల్‌ పంపిచారు. అయితే రాజీనామాకు గల కారణాన్ని కపిల్‌ వెల్లడించలేదని సమాచారం. రెండు రోజుల క్రితమే సీఏసీ సభ్యురాలు శాంత రంగస్వామి సైతం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. శాంత సీఏసీ సభ్యురాలిగా ఉండడంతో పాటు ఇండియన్‌ క్రికెటర్స్‌ అసోసియేషన్‌(ఐసీఏ)కు డైరెక్టర్‌గా వ్యవహరించారు. దీంతో ఆమె తన రెండు పదవులకు రాజీనామా చేసి ఐసీఏలో సామాన్య సభ్యురాలిగా కొనసాగేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు కపిల్‌దేవ్‌ కూడా రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాత్కాలిక క్రికెట్‌ సలహా కమిటీకి కపిల్‌ నేతృత్వం వహించగా అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామి ఇతర సభ్యులుగా ఉన్నారు. వీరు జులై 2019 నుంచి ఈ బాధ్యతలు చేపట్టగా భారత జట్లకు ప్రధాన కోచ్‌లను ఎంపిక చేయడమే వీరి పని. ఈ నేపథ్యంలోనే ఇటీవల భారత జట్టు ప్రధాన కోచ్‌ పదవికి ఇంటర్వ్యూలు చేసి రవిశాస్త్రిని తిరిగి నియమించారు. అయితే కపిల్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో పాటు ఫ్లడ్‌లైట్ల కంపెనీకి యజమానిగా ఉన్నాడని, అలాగే ఇండియన్‌ క్రికెటర్స్‌ అసోసియేషన్‌లో సభ్యుడిగా కొనసాగుతున్నాడని సంజీవ్‌ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

SHARE

LEAVE A REPLY