నో బాల్ అంపైర్ : పవర్ ప్లేయర్ ఆలోచనకు బ్రేక్!

0
220

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ – IPL మ్యాచ్‌ల్లో పవర్ ప్లేయర్ ఆలోచనకు స్వస్తి పలకాలని నో బాల్ అంపైర్ అంటూ ప్రత్యేకంగా నియమించాలని గవర్నర్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. తొలి సమావేశంలో దీనిపై విస్తృతంగా చర్చించింది. టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించాలని అనుకుంటున్నట్లు..కాబట్టి నో బాల్స్‌ను ప్రత్యేకంగా గుర్తించేందుకు ఒక అంపైర్ ఉంటే బెటర్ అని, రాబోయే ముస్తాక్ ఆలీ దేశవాళీ టీ 20 టోర్నీలో దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించే అవకాశం ఉందని కౌన్సిల్ సభ్యుడు వెల్లడించారు.

మ్యాచ్‌లో పవర్ ప్లేయర్‌ను తీసుకొచ్చే నిబంధనను ప్రస్తుతానికి పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ అంశంపై ఇప్పటి వరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అనుమతి లభించలేదని తెలుస్తోంది. ఎక్కువ మంది సీనియర్లు ఉన్న ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీకి చెందిన వ్యక్తి తమ అనుకూలత కోసమే ఈ కొత్త తరహా ప్రతిపాదన చేశారని సమాచారం.
మరోవైపు ఐపీఎల్ 2020 కోసం జరిగే ఆటగాళ్ల వేలంను డిసెంబర్ 19వ తేదీన కోల్ కతాలో నిర్వహించాలని గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రతిసారి వేలం బెంగళూరులోనే జరిగింది. 2019తో పోలిస్తే..ఈసారి ఒక్కో ఫ్రాంచైజీ మరో రూ. 3 కోట్లు అదనంగా ఉపయోగించుకొనే అవకాశం కల్పిస్తూ..గరిష్టంగా రూ. 85 కోట్లకు పెంచారు.

SHARE

LEAVE A REPLY