క్రికెట్ లీగ్ పోటీలు

0
364

Times of Nellore (Venkatagiri) # కోట సునీల్ కుమార్ #- కనుమూరు సత్యనారాయణ రెడ్డి క్రికెట్ కప్ లీగ్ పోటీలలో భాగంగా ఆదివారం వెంకటగిరి తారకరామా క్రీడా ప్రాంగణం లో జరిగిన మ్యాచ్ లలో “గ్రౌండ్ ఏ” లో ఎన్ ఆర్ సి సి, వి ఎస్ సి సి జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన వి ఎస్ సి సి జట్టు బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 40 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 302 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ జట్టులోని స్వరూప్ 59 ,దినేష్ 73 పరుగులు చేయగా ఎన్ ఆర్ సి సి జట్టు లోని ప్రతాప్ 3 ,చందు 2 వికెట్లు పడగొట్టారు. 303 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఎన్ ఆర్ సి సి జట్టు 33 .5 ఓవర్లలో 130 పరుగులకే అల్ అవుట్ అయింది. ఈ జట్టులోని సుబ్రహ్మణ్యం 33 ,సురేంద్ర 32 పరుగులు చేయగా,వి ఎస్ సి సి జట్టులోని మనోజ్,సుజన్,సుబ్రహ్మణ్యం 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. వి ఎస్ సి సి జట్టు 172 పరుగుల ఆధిక్యంతో భారీ విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ కు చిట్టిబాబు,రాంగోపాల్ లు అంపైర్ లుగా శంకర్ స్కోరర్ గా వ్యవహరించారు.

మరోవైపు గ్రౌండ్ బి లో జరిగిన మ్యాచ్ లో కేసీడీసీ, సింహపురి లయన్స్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కేసీడీసీ జట్టు బ్యాటింగ్ ఎంచుకుని 30 .5 ఓవర్లలో 117 పరుగులకు అల్ అవుట్ అయింది. ఈ జట్టులోని ఫరూక్ 39 ,నవీన్ 30 పరుగులు చేయగా సింహపురి జట్టులోని ప్రవీణ్ 5 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సింహపురి లయన్స్ జట్టు 30 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ జట్టు లోని లీలాసాయి 23 ,కృష్ణబాబు 20 (నాట్ అవుట్ ) పరుగులు సాధించగా కేసీడీసీ జట్టులోని రియాజ్ 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ కు అంపైర్ లుగా సి డి శ్రీనివాస్,మోహన్ రావు లు, స్కోరర్ గా సందీప్ వ్యవహరించారు.

SHARE

LEAVE A REPLY