క్రికెట్ లీగ్ పోటీలు

0
312

Times of Nellore (Venkatagiri) # కోట సునీల్ కుమార్ # – కనుమూరి సత్యనారాయణ రెడ్డి మెమోరియల్ క్రికెట్ కప్ లీగ్ మ్యాచ్ లలో భాగంగా శనివారం వెంకటగిరి తారకరామ క్రీడా ప్రాంగణం లో జరిగిన పోటీలలో ఎన్ ఆర్ సి సి , కె సి డి సి జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎన్ ఆర్ సి సి జట్టు 32 .1 ఓవర్లలో 127 పరుగులకే అల్ అవుట్ అయింది. ఈ జట్టులోని అఖిల్ 28 ,అనంతరాజ్ 20 పరుగులు చేసారు. శ్రీకాంత్, ఫరూఖ్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కె సి డి సి జట్టు 19 .2 ఓవర్లలో 3 వికెట్ల కొల్పోయి 129 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ జట్టులోని నవీన్ 40 ,రియాజ్ 28 పరుగులు చేసారు. ఈ మ్యాచ్ కు అంపైర్ లుగా రాంగోపాల్ ,అబూ,స్కోరర్ గా సి శంకర్ వ్యవహరించారు.

మరోవైపు గ్రౌండ్ బి లో ఎన్ సి సి ,అశోక్ లెవెన్ జట్లమధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎన్ సి సి జట్టు నిర్ణీత 40 ఓవర్లకలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఈ జట్టులోని సాయిశ్రీ చరణ్ రెడ్డి 96 ,ఫర్హాద్ 93 పరుగులు చేయగా, అభి 4 వికెట్లు తీసాడు.అనంతరం బ్యాటింగ్ కు దిగిన అశోక్ లెవెన్ జట్టు 17 .3 ఓవర్లలో కేవలం 54 పరుగులకే అల్ అవుట్ అయ్యారు. ఈ జట్టులోని ఆఫ్రిది 25 పరుగులు చేయగా తౌసీఫ్ 6 ,శరత్ 4 వికెట్లు పడగొట్టి జట్టు సీజయానికి తోడ్పడ్డారు. ఈ మ్యాచ్ కి అంపైర్ లుగా సి డి శ్రీనివాస్, కె హేమ సందీప్,స్కోరర్ గా యామిని వ్యవహరించారు.

SHARE

LEAVE A REPLY