క్రికెట్ లీగ్ సెమీఫైనల్స్

0
174

Times of Nellore (Venkatagiri) # కోట సునీల్ కుమార్ # – కనుమూరు సత్యనారాయణ రెడ్డి మెమోరియల్ క్రికెట్ లీగ్ పోటీలలో భాగంగా వెంకటగిరి తారకరామ క్రీడా మైదానంలో ఆదివారం సెమి ఫైనల్స్ జరిగాయి.

గ్రౌండ్ ఏ లో జరిగిన మ్యాచ్ లో ఎన్ బి కె ఆర్ (విద్యానగర్), వి ఎస్ సి సి (వెంకటగిరి) జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎన్ బి కె ఆర్ జట్టు 28 .1 ఓవర్లలో 127 పరుగులకు అల్ అవుట్ అయింది. ఈ జట్టులోని గురుసాయి 50 పరుగులు చేయగా, ఇజాజ్ 3 ,సుబ్రహ్మణ్యం 3 ,దినేష్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన వి ఎస్ సి సి జట్టు 17 .4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 132 పరుగులు సాధించింది. ఈ జట్టు లోని సుజన్ 61 ,బాలమురళి 37 లతో అజేయంగా నిలిచారు. వి ఎస్ సి సి జట్టు 7 వికెట్ల ఆధిక్యం తో విజయం సాధించి ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్ కు అంపైర్ లుగా మన్సూర్,మిహన్రావు ,స్కోరర్ గా శంకర్ లు వ్యవహరించారు.

గ్రౌండ్ బి లో జరిగిన మరో సెమీఫైనల్ మ్యాచ్ లో ఎన్ యూ సి సి, ఫై ఎం సి సి జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎన్ యూ సి సి జట్టు నిర్ణీత 40 ఓవర్లలో 223 పరుగులు చేసి అల్ అవుట్ అయింది. ఈ జట్టులోని బలమురుగన్ 56 , మోహన్ కృష్ణ 37 ,జగన్నాధ్ 34 పరుగులు చేయగా ఫై ఎం సి సి జట్టులోని శ్రీనాధ్ 4 ,విగ్నేష్ 2 ,కిషన్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఫై ఎం సి సి జట్టు 40 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు సాధించింది. ఈ జట్టులోని సంజయ్ 105 ,విగ్నేష్ 35 ,వినయ్ 32 పరుగులు చేయగా, ఎన్ యూ సిసి జట్టులోని మనోహర్ 3 వికెట్లు పడగొట్టాడు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ల్లో ఎన్ యూ సి సి జట్టు 4 పరుగువులా తేడాతో విజయం సాధించి ఫైనల్స్ కు చేరుకుంది. ఈ మ్యాచ్ కు అంపైర్ లుగా రాంగోపాల్,సి డి శ్రీనివాస్,స్కోరర్ గా యామిని వ్యవహరించారు.

SHARE

LEAVE A REPLY