క్రికెట్ లీగ్ పోటీలు

0
255

Times of Nellore (Nellore) # కోట సునీల్ కుమార్ # – కనుమూరి సత్యనారాయణ రెడ్డి మెమోరియల్ క్రికెట్ కప్ లీగ్ మ్యాచ్ లలో భాగంగా గురువారం స్థానిక ఏ సి సుబ్బారెడ్డి స్టేడియం లో సి వై సి సి నెల్లూరు, పి పి సి సి పడుగుపాడు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన సి వై సి సి జట్టు బ్యాటింగ్ ఎంచుకుని 38 .2 ఓవర్లలో 146 పరుగులకు అల్ అవుట్ అయింది. ఈ జట్టు లోని అర్జున్ 26 ,షాహుల్ 21 పరుగులు చేయగా, నమాజ్ 3 వికెట్లు పడగొట్టాడు. 147 పరుగుల విజయలక్ష్యం తో బరిలోకి దిగిన పి పి సి సి జట్టు 21 .4 ఓవర్లలో 127 పరుగులకే అల్ అవుట్ అయింది. ఈ జట్టు లోని నయాజ్29 , నమాజ్ 25 పరుగులు చేయగా సి వై సి సి జట్టులోని జై సాయి 7 వికెట్లు పడగొట్టి జట్టు విజయం లో కీలక పాత్ర వహించాడు.సి వై సి సి జట్టు 19 పరుగులతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ కు అంపైర్ లుగా పి చిట్టిబాబు,ఎం రాంగోపాల్, స్కోరర్ గా యామిని వ్యవహరించారు.

SHARE

LEAVE A REPLY