క్రికెట్ లీగ్ ఫైనల్స్

0
301

Times of Nellore (Venkatagiri) # కోట సునీల్ కుమార్ # – కనుమూరు సత్యనారాయణ రెడ్డి మెమోరియల్ క్రికిట్ లీగ్ ఫైనల్ మ్యాచ్ వి ఎస్ సి సి (వెంకటగిరి), ఎన్ యూ సి సి (నెల్లూరు) జట్ల మధ్య జరిగిన పోటీలో వి ఎస్ సి సి జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 40 ఓవర్లలో 232 పరుగులకు అల్ అవుట్ అయింది. ఈ జట్టు లోని సాయి స్వరూప్ 70 , సుజన్ 40 ,దినేష్ రెడ్డి 31 పరుగులు చేసారు. ఎన్ యూ సి సి జట్టులోని అల్లా బక్షు 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఎన్ యూ సి సి జట్టు 34 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ జట్టు లోని రంజీ ఆటగాడు అశ్విన్ హెబ్బార్ 90 , మోహన్ కృష్ణ 54 , థామస్ రాజ్ 41 పరుగులు చేసారు. ఎన్ యూ సి సి జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఛాంపియన్ గా నిలిచింది. ఈ మ్యాచ్ కు అంపైర్ లుగా రాంగోపాల్,మోహన్ రావు ,స్కోరర్ గా సి డి శ్రీనివాస్ వ్యవహరించారు.

ఈ క్రికెట్ లీగ్ ముగింపు సందర్బంగా జరిగిన సమావేశం లో ముఖ్య అతిధిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్ర విజేతలకు కప్ బహుకరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కనుమూరి హరిశ్చంద్రారెడ్డి ఈ పోటీలకు స్పాన్సర్ చేయడం సంతోషమన్నారు. ప్రతి సంవత్సరం కనుమూరు సత్యనారాయణరెడ్డి మెమోరియల్ క్రికెట్ లీగ్ పోటీలు నిర్వహిస్తున్నారని అన్నారు. మరో ముఖ్య అతిధి గా విచ్చేసిన ఏపీ సౌత్ జోన్ సెక్రటరీ నాగేశ్వర్ రాజు మాట్లాడుతూ, లీగ్ మ్యాచ్ లు ఆడడం క్రీడాకారుల నైపుణ్యానికి పరీక్షలవంటివని అన్నారు. నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, సౌత్ జోన్ లో క్రికెట్ లీగ్ పోటీలను నిర్వహిస్తున్నది ఒక్క ఎన్ డి సి ఏ మాత్రమే అన్నారు.ఈ పోటీలకు సహకరిస్తూ, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న  కనుమూరు హరిశ్చంద్రా రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ డి సి ఏ కోశాధికారి రాజశేఖర్ రెడ్డి, జాయిన్ సెక్రటరీ కె శ్రీనివాసులు రెడ్డి,పి భానుప్రకాష్ రెడ్డి, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY