నేడు భారత్ vs బంగ్లాదేశ్ మధ్య తొలి డేఅండ్ నైట్ టెస్ట్!!

0
188

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య ఇవాళ తొలి డే అండ్ నైట్ టెస్ట్ ప్రారంభం కానుంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఫ్లడ్ లైట్ల వెలుతురులో గులాబి బంతిలో ఇరుజట్లు ఆడనున్నాయి. ఈ టెస్టు సిరీస్ లో ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. మ్యాచ్ ను మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8గంటల వరకూ నిర్వహించనున్నారు. నవంబరు 22నుంచి 26వరకూ డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలైనప్పటికీ ఫస్ట్ సెషన్ 3గంటలకు పూర్తి అవుతుంది. రెండో సెషన్ 3గంటల 40నిమిషాలకు మొదలై సాయంత్రం 5గంటల 40నిమిషాల వరకూ కొనసాగుతుంది. ఇందులో చివరి భాగం సాయంత్రం 6గంటలకు మొదలై రాత్రి 8గంటల వరకూ జరుగుతుంది. తొలిరోజు ఆటను తిలకించేందుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, సీఎం మమతా బెనర్జీ తిలకించనున్నారు.

SHARE

LEAVE A REPLY