నా బ్యాటింగ్ చూసి కీపర్ రానని చెప్పాడు…

0
71

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- భారత యువ ఓపెనర్ పృథ్వీ షా 2018 అక్టోబర్‌లో మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అయితే అంతకముందే షాకు దేశవాళీ క్రికెట్లో మంచి పేరుంది. 2013 లో ముంబైలోని ఆజాద్ మైదానంలో జరిగిన హారిస్ షీల్డ్ మ్యాచ్ సందర్భంగా, 14 ఏళ్ల పృథ్వీ 2 రోజుల పాటు బ్యాటింగ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో 546 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో మొత్తం 85 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అప్పటివరకు అండర్-14 లో షా చేసిన పరుగులే అత్యధికం. షాకు ఈ రికార్డు సృష్టించడానికి 367 నిమిషాలు పట్టింది.

అయితే ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూ లో పృథ్వీ షా మాట్లాడుతూ అప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తుచేసుకున్నాడు. తన బ్యాటింగ్ చూసి ప్రత్యర్థి జట్టుకు చెందిన వికెట్ కీపర్ చాలా నిరాశకు గురయ్యాడని మళ్ళీ కీపింగ్ కు రావడం లేదు అని చెప్పాడట. పృథ్వీ మాట్లాడుతూ… “ఆ సమయంలో నేను 300 వద్ద ఆడుతున్నాను. అయితే అప్పటివరకు కీపర్ కు ఒక బాల్ కూడా పోలేదు. అతను బంతి కోసం చాలాసేపు చూసాడు. ఇక ఆ రోజు ఆట ముగిసిన తర్వాత కీపర్ ” నేను రేపు కీపింగ్ చేయడానికి రావడం లేదు” అని తన జట్టుతో చెప్పాడు అంటూ షా పేర్కొన్నాడు.

SHARE

LEAVE A REPLY