అక్టోబర్ 22న బీసీసీఐ ఎన్నికలు

0
239

Times of Nellore (Delhi) #కోట సునీల్ కుమార్ #  – బీసీసీఐకి అక్టోబర్ 22వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామని సీవోఏ చీఫ్ వినోద్ రాయ్ స్పష్టం చేశారు. ముగ్గురు మెంబర్లతో కూడిన సీవోఏ కమిటీ న్యూఢిల్లీలో మంగళవారం సమావేశమైంది. ఈ సమావేశంలో బీసీసీఐకి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సీవోఏ పేర్కొంది. రాష్ట్ర అసోసియేషన్స్ ఎన్నికలను సెప్టెంబర్ 14వ తేదీలోపు పూర్తి చేయాలని, సెప్టెంబర్ 23లోపు ప్రతినిధుల పేర్లను బీసీసీఐకి పంపించాలని సీవోఏ కమిటీ తెలిపింది. అమికస్ క్యూరీతో చర్చించిన తర్వాత సీవోఏ నిర్ణయం తీసుకుంది.

SHARE

LEAVE A REPLY