జగన్ ను కలిసిన క్రీడాకారిణి నాగాంజలి

0
244

Times of Nellore (Nidadavolu) – నిడదవోలు పట్టణానికి చెందిన వై.నాగాంజలి క్రీడారంగంలో రాణిస్తోంది. జాతీయ స్థాయిలో పతకాల పంట పండిస్తున్నా..పేద కుటుంబానికి చెందిన నాగాంజలికి ఆర్థికంగా ఆసరా కరువై సహాయం కోసం వేచి చూస్తోంది. ఆదివారం పాదయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తను సాధించిన పతకాలను చూపించి బాధ చెప్పుకుంది. 800 మీటర్లు, 1,500 మీటర్లు, 3,000 మీటర్లు పరుగు పోటీల్లో స్కూల్స్‌ గేమ్స్, జాతీయస్థాయి క్రీడపోటీల్లో సత్తా చాటుకున్నట్టు తెలి పింది. రాష్ట్రస్థాయి పోటీల్లో 13 బంగారు పతకాలు సాధించడంతోపాటు, నేషనల్‌ లెవెల్‌ స్కూల్స్‌ గేమ్స్‌లో బ్రాంజ్‌ మెడల్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం విజయవాడ సిద్ధార్థ డిగ్రీ కాలేజీలో ద్వితీయ సంవత్సరం డిగ్రీ చదువుతోంది. కోచ్‌లు నాగరాజు, కృష్ణల సహకారంతో క్రీడల్లో రాణిస్తుండగా, తనకు ప్రోత్సాహమందిస్తే మరిన్ని పతకాలు సాధిస్తానని ఆమె జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేసింది. తండ్రి సత్తిబాబు తాపీమేస్త్రీగా పనిచేస్తూనే ముగ్గురు ఆడపిల్లలను చదివిస్తున్నారని తెలిపింది. తమకు ఆర్థికంగా సహాయం చేయాలని కోరారు.

SHARE

LEAVE A REPLY