కోహ్లీ కెరీర్ లో మరో మైలురాయి

0
206

Times of Nellore (Visakha) –కోట సునీల్ కుమార్:  వెస్టిండీస్ జట్టుతో ఇక్కడ జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఫీట్ సాధించాడు. వన్డే చరిత్రలో 10000 పరుగులు చేసిన అయిదవ ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. వెస్టిండీస్ బౌలర్ ఆష్లీ నర్స్ వేసిన 36వ ఓవర్‌లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఆటగాళ్లలో కోహ్లీ 13వ ఆటగాడిగానూ, భారత ఆటగాళ్లలో 4వ ఆటగాడిగానూ చోటు సంపాదించుకున్నాడు. అంతకు ముందు ఈ ఫీట్ సాధించిన భారత ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ ఈ ఫీట్ సాధించిన ఆటగాళ్లలో ఉన్నారు. అయితే కోహ్లీ కేవలం 213 మ్యాచ్‌లలోనే ఈ ఫీట్ సాధించడం మరో విశేషం. ప్రస్తుతం టీంఇండియా మూడు వికెట్ల నష్టానికి 36 ఓవర్లలో 195 పరుగులు చేసింది.

SHARE

LEAVE A REPLY