నేటి నుంచి వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాలు

0
136

Times of Nellore (Venkatachalam) – వెంకటాచలం మండలంలోని గొలగమూడి వెంకయ్యస్వామి 36వ ఆరాధనోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి 24వ తేదీ వరకు జరగనున్న ఆరాధనోత్సవాలకు మొత్తం మూడు లక్షల మంది భక్తులు వస్తారని ఆశ్రమ నిర్వాహకుల అంచనా. ఈవో బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఏటా జరిగే ఈ ఉత్సవాలకు మన రాష్ట్రంతోపాటు, తెలంగాణా, తమిళనాడు, కర్ణాటకా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు. భక్తులు సేద తీరేందుకు వసతి గృహాలు, కల్యాణ మండపాలు, డార్మెటరీలు సిద్ధం చేశారు. తెప్పోత్సవానికి కోనేరు ముస్తాబైంది. భక్తులకు ఇస్కపాళెం ఆరోగ్య కేంద్రంతో పాటు ఆశ్రమం ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు జరిగే ఏడు రోజులు అన్నదానం ఉంటుంది. ప్రతి రోజు ఉదయం, రాత్రి ఉత్సవ గ్రామోత్సవం నిర్వహించనున్నారు. సాయంత్రం సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం వేకువన గోపూజ, అభిషేక పూజలు, ఉదయం 10 గంటలకు సర్వభూపాల వాహన సేవ, రాత్రి 9గంటలకు కల్పవృక్ష వాహన సేవ గ్రామోత్సవం జరగనుంది.

SHARE

LEAVE A REPLY