ఎన్ని జన్మలైనా భారత దేశం లోనే పుట్టాలనుకుంటా – కోట సునీల్ కుమార్

0
255

Times of Nellore (Podalakuru) #సూర్య#- నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం లో ఆదివారం సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హిందూ ధార్మిక సమ్మేళనం నిర్వహించారు. పొదలకూరు సాయిబాబా మందిరం లో జరిగిన ఈ కార్యక్రమంలో హిందూ దేవాలయ ప్రతిష్టాపన పీఠం, శ్రీ కమలానంద స్వామి, సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ జిల్లా కో ఆర్డినేటర్ కోట సునీల్ కుమార్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. శ్రీ కమలానంద స్వామి మాట్లాడుతూ… హిందూ ధర్మం యుగయుగాలుగా ఉందన్నారు.శ్రీ కృష్ణుడి పాద స్పర్శ తో పునీతమైన నేల ఈ భారత దేశమన్నారు. కోట సునీల్ కుమార్ మాట్లాడుతూ, భగవన్నామ స్మరణలో మనసుకు శాంతి లభిస్తుందన్నారు. రామ మందిర నిర్మాణం కోసం కోర్టులచుట్టూ తిరగాల్సిన దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని, రామనామ స్మరణ మారుమ్రోగడం ద్వారా రామమందిర నిర్మాణం అయోధ్యలో జరిగి తీరుతుందని అన్నారు. రానున్న కాలం లో ప్రతి దేవస్థానం లో అనేకమంది కళాకారులకు ఉపాధి లభిస్తుందని అన్నారు. ఎన్ని జన్మలైనా భారత దేశం లోనే పుట్టించమని భగవంతుణ్ణి కోరుకుంటానన్నారు. ఈ దేశం లో ప్రజలు ప్రేమ, ఆప్యాయతలతో జీవనం సాగిస్తారని అన్నారు.  భజన బృందాలు తమ భజనలతో భగవంతుణ్ణి కీర్తిస్తూ అలరించారు.   ఈ కార్యక్రమంలో విరువూరు సుకాశ్రమం మార్కండేయస్వామి, సాయి బాబా మందిరం అధ్యక్షులు చీమకుర్తి కృష్ణయ్య, వెంగల్ రెడ్డి, లక్కాకుల ఆనందరావు, నాగిశెట్టి దామోదర రావు ,ఎన్ ఉమమ్మ, గజ్జెల భాగ్యమ్మ, మోపూరు అమర్ నాధ్, గంగవరం వేణుగోపాల్ రెడ్డి, రాచపూడి ధనుంజయరావు, భజన బృందాలు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY