ముత్తుకూరు హైస్కూల్ నందు స్వైన్ ఫ్లూ పై అవగాహన

0
103

Times of Nellore  (Mthukuru) – కోట సునీల్ కుమార్: ముత్తుకూరు హైస్కూల్ నందు విద్యార్థులకు స్వైన్ ఫ్లూ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ముత్తుకూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శాలిని ఈసంధర్బంగా మాట్లాడారు. స్వైన్ ఫ్లూ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.చేతులు తరచు సుభ్రపరచుకోవాలన్నారు.దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు చేతి రుమాలు ముక్కుకు అడ్డు పెట్టుకోవాలని సూచించారు.కనీసం చేతులైనా అడ్డు పెట్టుకోవాలన్నారు.ఎవరినైనా కలిసేటప్పుడు కరచాలనం, కౌగిలించుకోవడం చేయరాదని తెలిపారు.మనం ఉపయోగించిన చేతి రుమాలు,టిష్యూ పేపర్ ను చెత్త బుట్టలో వేయాలని పేర్కొన్నారు. స్వైన్ ఫ్లూ సంబంధించిన లక్షణాలు కనిపిస్తే నిర్థారిత ఆసుపత్రి కి వెళ్లి పరీక్షీంచు కోవాలి కోరారు. అశుభ్రమైన చేతులతో ముక్కు, నోరు , కళ్ళు తాకరాదని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు మహబూబ్ షరీఫ్, పిహెచ్ఎన్ సులోచన, బాలకృష్ణ, సుబ్బమ్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY