విద్యార్ధులకు నోటు పుస్తకాలు పంపిణి చేసిన 1వ నగర సి.ఐ కరీం

0
520

జూలై 05 ( నెల్లూరు ) – రంజాన్ పండుగను పురస్కరించుకొని నెల్లూరు 1వ నగర పోలీస్ స్టేషన్ సి.ఐ. అబ్ధుల్ కరీం విద్యార్ధులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు.ముస్లిం యూత్ సేవా కమిటి ఆధ్వర్యంలో ఆయన ఈ కార్యక్రమాన్నిచేపట్టారు. జెండావీధిలోనున్న ఉర్ధూ పాఠశాలలో విద్యార్ధులకు నోటు పుస్తకాలతో పాటూ పలకలు, పెన్నులు, పెన్సిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా సి.ఐ. అబ్ధుల్ కరీం మాట్లాడుతూ ముస్లిం యూత్ సేవా కమిటి సేవా కార్యక్రమాల నిర్వహణలో ముందుందని అధ్యక్షులు ఎస్.కే.ఖాలిద్ ను అభినందించారు. వారు చేస్తున్న సేవా కార్యక్రమాలతో ప్రేరణ పొంది తన సొంత ఖర్చుతో వీటిని పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ముస్లిం యూత్ అధ్యక్షులు ఖాలిద్ మాట్లాడుతూ మహ్మద్ ప్రవక్త చెప్పిన బోధన అనుసారంగా సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కేజిఎస్ మున్నా, అలీమ్, అల్తాఫ్, ఫజల్, స్కూల్ హెడ్ మాస్టర్ అబ్ధుల్ గయాజ్ పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY