వాడి వేడి గా జిల్లాపరిషత్ సమావేశం

0
91

Times af Nellore (Nellore) # కోట సునీల్ కుమార్ #- నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయం లో గురువారం సమావేశం జరిగింది. జెడ్ పి చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో జిల్లా మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ, జిల్లా ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ ,జెడ్ పి టి సి సభ్యులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాలలోని సమస్యలను మంత్రుల దృష్టికి తేగా మంత్రులు వారి సమస్యలపై స్పందించి సమాధానమిచ్చారు. కోవూరు ఎమ్మెల్యే పొలం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి తమ నియోజకవర్గంలో సాగునీరు గత ఏడాదికూడా ఇవ్వలేదని ప్రస్తావించగా, సొంత పార్టీ ఎమ్మెల్యే లు పొలం రెడ్డి ని వ్యతిరేకించారు. మొత్తం మీద సమావేశం వాడి వేడి గా జరిగింది.

SHARE

LEAVE A REPLY