వై.ఎస్.ఆర్.సీ.పీ “వంచనపై గర్జన”

0
216

Times of Nellore ( Nellore ) – ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత వైఖరికి నిరసనగా వంచనపై గర్జన నినాదంతో వైసీపీ రాష్ట్ర వ్యాప్త క‌లెక్ట‌రేట్ల ముట్ట‌డి కార్యక్రమం చేపట్టింది. నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో వై.ఎస్.ఆర్.సీ.పీ నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు. గాంధీ బొమ్మ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాలకు నిరసనగా ఈ రోజు వంచనపై గర్జన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. వై.ఎస్.ఆర్.సీ.పీ నాయకులు రెండు రోజులు పాదయాత్ర చేసి కలెక్టరేట్ ముట్టడించి, కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరుగుతుందని అన్నారు. నాలుగు సంవత్సరాలుగా అవినీతికి పాల్పడూ, రాష్ట్రాన్ని అభివృద్ధిలో కాకుండా అవినీతిలో నంబర్ ఒన్ చేసిన ఘనత చంద్రబాబుది అన్నారు. జగన్ మోహన్ రెడ్డి విధానపరమైనటువంటి నిర్ణయాలు ప్రకటిస్తూ, ప్రజల్లోకి వెళుతూ, 2000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసి ప్రజలకు సంబంధించి అన్నీ సమస్యల గురించి ఆలోచన చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్న ఒకేఒక్కడు జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. చంద్రబాబు అవినీతి కొరకు స్పెషల్ ప్యాకేజ్ తీసుకొని ఆ డబ్బుల వారికి ఇష్టం వచ్చినటు వినియోగించుకొవచ్చని, అదే ప్రత్యేక హోదా లో వచ్చే డబ్బులు ముఖ్యమంత్రికి అందవని ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టాడని ఎంపీ వరప్రసాద్ రావు అన్నారు. ప్రజలకు అబద్దాలు చెప్పి ముఖ్యమంతి అయ్యాడని అన్నారు. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు వైసీపీ పార్టీ పోరాడుతుంటుందని తెలిపారు.

అనంతరం నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ మాట్లాడుతూ.. 600 పైగా హామీలు ఇచ్చి టిడిపి అధికారంలోకి వచ్చి, నాలుగు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజల్ని వంచన చేసిందన్నారు. నాలుగు సంవత్సరాలు పాటుగా ఈ రాష్ట్రానికి ఏమి చేయ్యాలేదని, కేవలం అవినీతి, దోపిడీ, ప్రచారార్భాటాలు తప్ప ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏమిలేదని అన్నారు. అంతేకాకుండా నాలుగు సంవత్సరాలు పాటు కేంద్రంతో కలిసిమెలిసి ఉండి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కనీస ప్రయత్నం చేయకుండా ఉండిందని అన్నారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి అవసరం లేదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సంవత్సరం వచ్చేసరికి కొత్త డ్రామాలాడుతూ, మోసం చేస్తున్నాడని అన్నారు. అందులో భాగంగానే ఈ రోజు వంచనపై గర్జన పేరుతో ప్రతి జిల్లా కలెక్టరేట్ ముట్టడించడం జరుగుతందని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి 2000 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకుని ఎండ, వాన అన్న తేడా లేకుండా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు శ్రమిస్తున్నారని అన్నారు. అలాంటి నాయకులను ప్రజలు ఆశీర్వదించి రాబోయే ఎన్నికల్లో రాజన్న రాజ్యం కోసం జగనన్న ను గెలిపించాలని అని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY