కార్యకర్తల ఋణం తీర్చుకుంటా – ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

0
264

Times of Nellore (Nellore\Rural) – వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర 2000 కి.మీ.పూర్తి చేసుకున్న సందర్బంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం, 33 ,34 డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ల ఆధ్వర్యంలో ఎన్ సి సి కాలనీ లో మెగా వైద్య శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు.అనంతరం అయన మాట్లాడుతూ…వైఎస్ జగన్ సాగిస్తున్న పాదయాత్ర దేశరాజకీయాలలోనే సంచలనం సృష్టిస్తుందని అన్నారు.వైఎస్సార్సీపీ గుర్తు మీద గెలిచిన ప్రజాప్రతినిధులు కాసుల కక్కుర్తి కోసం, అధికారం కోసం పార్టీని వదిలి వెళ్లినా, కార్యకర్తలుమాత్రం వేధింపులు తట్టుకుంటూ,అంకిత భావంతో, గుండెల్లో రాజశేఖర్ రెడ్డి ని, నెత్తిమీద జగన్ మోహన్ రెడ్డి ని పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతిలో పట్టుకుని పార్టీ పటిష్టత కోసం, ప్రజాసమస్యలకోసం పోరాడుతున్న తీరు దేశంలోని అన్ని రాజకీయపార్టీలకు, కార్యకర్తలకు ఆదర్శంగా నిలుస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల తీరు ను చూసి ఎమ్మెల్యే గా గర్వపడుతున్నానని అన్నారు .భవిష్యత్తు లో పార్టీ మోసిన ప్రతి కార్యకర్త ఋణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.

SHARE

LEAVE A REPLY