వైసీపీలో చేరిన టీడీపీ నెల్లూరు జిల్లా ప్రచారకార్యదర్శి బాలాజీ!

0
76

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-నెల్లూరు నగరంలోని 9వ డివిజన్ కు చెందిన టిడిపి జిల్లా ప్రచార కార్యదర్శి కువ్వారపు బాలాజీ వారి మిత్రబృంద్రం స్టోన్ హౌస్ పేట జలకన్య బొమ్మ సెంటర్ నుంచి రాజన్న భవన్ వరకు రెండు వేల మందితో బైక్ ర్యాలిగా వచ్చి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనీల్ కుమార్, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో నగరంలోని మదాల చంద్రశేఖరం కళ్యాణ మండపంలో వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరగా, వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు రామగిరి సుబ్రమణ్యం, టిడిపి నగర వాణిజ్య విభాగ అధ్యక్షులు నారాయణ ఆనంద్, టిడిపి మాజీ నగర తెలుగు యువత అధ్యక్షులు దారపనేని బ్రహ్మనాయుడు, 9వ డివిజన్ టిడిపి అధ్యక్షులు నాగేశ్వరరావు, నవాబుపేట శివాలయం మాజీ చైర్మన్ ముత్తినేని బాలకిషోర్ నాయుడు, మోమిడి శంకర్ తదితరులు పార్టీలో చేరగా, ఈ కార్యక్రమంలో నాయకులు ముక్కాల ద్వారకనాథ్, కొండ్రెడ్డి రంగారెడ్డి, సన్నపురెడ్డి పెంచలరెడ్డి, తిప్పిరెడ్డి రఘురామిరెడ్డి, వంగాల శ్రీనివాసులు రెడ్డి. ఈదల ధనూజారెడ్డి, అద్దంకి జగన్, మర్రి శ్రీధర్, పొడమేకల సురేష్, అబ్దుల్ సలాం, ఎం.సుబ్బారావు, శ్యామలమ్మ, బట్టా కోటేశ్వరరావు, పాకాల లక్ష్మీనారాయణ, సుమతి తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY