ఈడీ చే విచారణ జరిపించండి, సోమిరెడ్డి రంగు బయటపడుతుంది – కాకాణి ఎదురు దాడి

0
507

Times of Nellore ( Nellore ) – తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై తాను చేసిన ఆరోపణలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని, సర్వేపల్లి శాసనసభ్యులు, వైసీపి నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి నకిలీ పత్రాలు సృష్ఠించి, తనపై ఆరోపణలు చేస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నెల్లూరు పోలీసులు, సోమిరెడ్డి పై ఫోర్జరీ పత్రాలు సృష్ఠించింది వీరే నని ముగ్గుర్ని అరెస్టు చేసిన కొద్ది నిముషాలకే, కాకాణి గోవర్ధన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి, మాట్లాడారు. సోమిరెడ్డి పై తాను చేసిన ఆరోపణలు విదేశాలకు చెందినవని, ఈ నేపద్యంలో సిబిఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చే విచారణ జరిపిస్తే అసలు నిజం బయటపడి ఉండేదని అన్నారు.

దీన్ని కేవలం నెల్లూరుజిల్లా పరిమితం చేసి, కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సోమిరెడ్డి కనుసన్నల్లో విచారణ జరిగిన విధంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ విషయం కోర్టులో పరిధిలో ఉన్న దృష్ఠ్యా తాను కేంద్రస్థాయి దర్యాప్తు జరపాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరతానని కాకాణి వెల్లడించారు. నకిలీ మద్యం కేసులో తాను, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రమేయం లేదని మొదట కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసిన సిఐడి పోలీసులు, తర్వాత దాన్ని వెనక్కు తీసుకొని తమ ప్రమేయం ఉన్నట్లుగా మరో చార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేశారని, ఇదేనా ప్రభుత్వ నిబద్ధతత అని ప్రశ్నించారు. కేంద్ర స్థాయి దర్యాప్తు జరపాలను ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, నెల్లూరునగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ కూడా పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY