నెల్లూరు రూరల్ వైసిపి లోకి ఆమ్ ఆద్మీ పార్టీ యువజన నాయకుడు!

0
89

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ – నెల్లూరు రూరల్ వైసిపి లోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. ఇది ఇలా ఉండగా ఈరోజు ఉదయం ఆద్మీ పార్టీ యువజన నాయకుడు ముసునూరు వినోద్ కుమార్ వైసిపి తీర్ధం పుచ్చుకున్నారు. వినోద్ కుమార్ ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ వినోద్ కుమార్ మరియు అతని మిత్రులందరికీ పార్టీలో సముచిత స్థానం ఉంటుందని పేర్కొన్నారు. వినోద్ కుమార్ మాట్లాడుతూ అభివృద్ధికి చిరునామాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగారు వ్యవహరిస్తున్నారని, వైసిపి అభివృద్ధిని, ప్రజల కోసం వారు పాటుపడుతున్న తీరును చూసి పార్టీలో చేరినట్లు చెప్పారు.

SHARE

LEAVE A REPLY