6 వ డివిజన్ లో ముక్కాల ద్వారకానాధ్ ప్రచారం

0
115

Times of Nellore (Nellore) # కోట సునీల్ కుమార్ # – నెల్లూరు నగర 6 వ డివిజన్ లో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాధ్ ఆధ్వర్యంలో వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచిపెట్టారు. ఈ సందర్బంగా ముక్కాల ద్వారకానాధ్ మాట్లాడుతూ, రాష్ట్రము లో వైసీపీ ని గెలిపించుకుని, జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి ని చేయవలసిన అవసరం ఉందన్నారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ 10 సంవత్సరాలనుండి ప్రజాసేవలో ఉన్నారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా తన శాయశక్తులా కృషి చేసి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు నిర్వహించారన్నారు. అనిల్ కుమార్ యాదవ్ ను మరోసారి ఎమ్మెల్యే గా ఆశీర్వదించాలన్నారు. టీడీపీ ప్రభుత్వం లో అభివృద్ధి పేరుతొ దోపిడీ జరుగుతుందని అయన ఆరోపించారు.

SHARE

LEAVE A REPLY