మనుబోలు మండలంలో మహిళ దారుణ హత్య..

0
454

Times of Nellore ( Manubolu ) – సుమారు 30 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని మహిళను దారుణంగా హత్యచేసి కిరోసిన్ పోసి తగలబెట్టిన సంఘటన సంఘటన నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వీరంపల్లి క్రాస్ రోడ్స్ దగ్గర చోటుచేసుకుంది. మహిళను చంపి, శవాన్ని తగలబెట్టినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. స్థానికుల సమాచారం మేరకు గూడూరు అర్బన్ సీఐ కల్యాణ్ రాజు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసు జాగిలం ద్వారా విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా గూడూరు అర్బన్ సిఐ మాట్లాడుతూ, తను త్వరలో హంతకులను పట్టుకుంటామని వెల్లడించారు.

SHARE

LEAVE A REPLY