మహిళా చట్టాలను వినియోగించుకోండి – అంచల వాణి

0
213

Times of Nellore (Nellore): కోట సునీల్ కుమార్: నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మెటర్నిటీ విభాగాన్ని ఆంధ్రప్రదేశ్ మహిళా కమీషన్ సభ్యురాలు అంచల వాణి సందర్శించారు.
హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావుతో కలిసి మెటర్నిటీ వార్డులో ఉన్న బాలింతలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అంచల వాణి మాట్లాడుతూ మెటర్నిటీ విభాగంలో వైద్య సేవలు సంతృప్తి కరంగా ఉన్నాయన్నారు. వివిధ రంగాలలో మహిళలపై జరుగుతున్న శారీరక,మానసిక,లైంగిక వేధింపులను నిరోధించడానికి ఎన్నో చట్టాలున్నాయన్నారు. మహిళలకు ఈ చట్టాలపై అవగాహన లేక వాటి ప్రయోజనాలను పొందలేక పోతున్నారన్నారు. అందుకే హాస్పిటల్లో “వన్ స్టాప్ సెంటర్” ను ఏర్పాటు చేశామని,జిల్లా కోఆర్డినేటర్ పర్యవేక్షణలో నిర్వహించబడుతున్న ఈ సెంటర్ ద్వారా మహిళలు మరిన్ని సేవలు పొందవచ్చని అంచల వాణి తెలిపారు. అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావు మాట్లాడుతూ హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన “వన్ స్టాప్ సెంటర్” భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని మహిళా శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో నిర్వహించబడుతుందన్నారు. ఈ సెంటర్  పురుషుల ద్వారా వివిధ రకాల వేధింపులకు గురవుతున్న మహిళలకు బాసటగా నిలుస్తుందన్నారు. మహిళా చట్టాలు వినియోగించుకోవడానికి కావలసిన వైద్య పరీక్షలు,న్యాయ సహాయం వంటి అన్ని సేవలు ఇక్కడే అందుబాటులో ఉన్నాయన్నారు.ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.రాధాకృష్ణ,వన్ స్టాప్ సెంటర్ జిల్లా కో-ఆర్డినేటర్ షెహనాజ్,వైద్యులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY