ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభం!!

0
30

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సూచన మేరకు నెల్లూరు నగరంలోని 50వ డివిజన్ ములు ముడి బస్టాండ్ , ఆంజనేయస్వామి గుడి వీధి , మాగుంట నగర్ , ఉప్పరపాలెం తదితర ప్రాంతాల్లో వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కుమార్ యాదవ్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ఆర్ఓ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు కొణిదల సుదీర్, వందవాసి రంగా , కుంచాల శ్రీనివాసులు, సునీల్ కుమార్, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY