ఏ.సి.స్టేడియం వాకర్స్ సంఘం చేపడుతున్న సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శం – ఎమ్మెల్యే కోటంరెడ్డి

0
247

Times of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శనివారం ఏ.సి స్టేడియం సందర్శించి వాకర్స్ తో ముచ్చటించారు. అనంతరం చిన్నారులకి పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖయాతి కీర్తన, మోక్షజ్ఞ హరి జన్మదినం సందర్భంగా వారు పౌష్టికాహారం పంపిణీకి దాతలుగా వ్యవహరించినందుకు వారిని వారి కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొన్ని వేలచోట్ల వాకర్స్ వాకింగ్ చేస్తుంటారని, ఆ తరువాత వారి పనిలో వారు పడిపోతారని, కొన్ని చోట్ల మాత్రం వాకర్స్ సంఘాలు ఏర్పడి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, ఇది చాలా మంచి పరిణామం అని అందులో ముఖ్యంగా ఏ.సి. స్టేడియం వాకర్స్ అసోషియోషన్ అగ్రభాగాన నిలచిందని, ఏ.సి. స్టేడియం వాకర్స్ అసోసియోషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరికి ఆదర్శం అని అన్నారు. అనాదలకి, పేదలకి మనం అండగా నిలిస్తే, సేవా కార్యక్రమాలు చేపడితే ఆ భగవంతుడు మనకు, మన కుటుంబాలకి అండగా నిలుస్తాడని, ఇది వ్యక్తిగతంగా తాను నమ్మే విశ్వాసం అని అన్నారు. దైనందిన రాజకీయాల్లో సేవా కార్యక్రమాల్లో ఉన్న తృప్తి తనకు మరేదాంట్లో ఉండదని, అందుకే తన రాజకీయ కార్యక్రమాల్లో సామాజిక సేవా కార్యక్రమాలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. అనంతరం రెవెన్యూ కాలనీ, బాలనదన్ లో కూడా చిన్నారులకి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పౌష్టికాహారం పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో వి. రంగారావు, రమేష్, కె.ఎల్. రెడ్డి, షణ్ముగరాం, ప్రసాద్, డా. శ్రీనివాస కుమార్, డా. అంకి రెడ్డి, రాఘవేంద్ర షెట్టి, గఫార్, బొప్పల శ్రీనివాస యాదవ్, డి.యస్.డి.ఓ రమణయ్య, జయదేవ్, శ్రీనివాస కుమార్, ఎమ్.యస్ రెడ్డి, బాషా తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY