వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం!!

0
101

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మద్రాసు బస్టాండు వద్ద ఉన్న మార్కెట్ ఆవరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ వెంట నడిచే కార్యకర్తలు, నాయకులకు న్యాయం చేసే విషయంలో రాజకీయంగా నాకు నష్టం వాటిల్లినా రాజీపడనని అన్నారు. అనంతరం కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ ఆనం విజయకుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ఏసునాయుడు చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారని, కాని ఇంత వరకు పదవులు రాలేదన్నారు. కాని ప్రస్తుతం పదవి రావడం ప్రతి ఒక్కరికి సంతోషకరంగా ఉందన్నారు. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ష్టపడే ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామన్నారు. అందరం కలసి రూరల్ నియోజవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ ఛైర్మెన్ కొండ్రెడ్డి రంగా రెడ్డి, నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY