వి పి ఆర్ విద్యలో నూరు శాతం ఉత్తీర్ణత – ప్రిన్సిపాల్ వి టి శ్రీనివాస్

0
162

Times of Nellore (Nellore) #కోట సునీల్ కుమార్ #  – రాజ్యసభ  సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దాతృత్వంలో నిరుపేద , ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలనే ఉన్నత ఆశయాలతో వి.పి.ఆర్ ఫౌండేషన్ స్థాపించి తద్వారా వి.పి.ఆర్ అను ఉన్నత పాఠశాలను 2016 లో నెలకొల్పారని, కార్పొరేట్ వసతులతో అన్ని ఉచితంగా అందించబడి నిరుపేద , ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రవేశ పరీక్షా ద్వారా వి.పి.ఆర్ విద్యలో చేర్చుకోవడం జరుగుతుందని పాఠశాల ప్రిన్సిపాల్ వి టి శ్రీనివాస్ తెలిపారు.

2018 – 2019 సంవత్సరానికి గాను పదోవ తరగతి  మొదటి బ్యాచ్ 30 మంది విద్యార్థులు నేడు ఉన్నత మార్కులతో ఉత్తీర్ణులవడం వి.పి.ఆర్ విద్య కే గర్వకారణమన్నారు. ఈ విజయానికి మూలస్తంభాలుగా వి.పి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కో-చైర్మన్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గార్లు చొరవ, దాతృత్వం , నిరంతర శ్రమ వలన నేడు 30 మంది విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణులవడం వి.పి.ఆర్ ఫౌండేషన్ కు అరుదైన గౌరవమన్నారు. 10వ తరగతిలో 30 మంది విద్యార్థులలో నలుగురు విద్యార్ధులు 10 జి.పి.ఏ. సాధించగ, 9 పాయింట్స్ మరియు అంతకన్నా ఎక్కువ జి.పి.ఏ. సాధించినవారు మొత్తం 22 మంది. మిగిలిన వారికి 8.8, 8.5 మరియు 8.3 పాయింట్స్ వచ్చాయన్నారు.

సి.ఈ.ఒ. ఆచార్య నారాయణరెడ్డి గారు మాట్లాడుతూ, ఆటో డ్రైవర్లు, ప్రైవేటు రంగంలో చిరు ఉద్యోగులు, రైతులుగా ఉన్నవారి పిల్లలు ఇక్కడ చదువుతున్నారని, అటువంటివారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడం కొరకు విద్యార్ధులకు అన్నీ ఉచితంగా అందజేస్తూ, కావలిసినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి, వారి లక్ష్యసాధనకు వి.పి.ఆర్. ఫౌండేషన్ ఎంతో సహకరిస్తుందని తెలియజేశారు. అత్యంత నిరుపేద , ప్రతిభావంతులైన విద్యార్థులను కస్టపడి వారిని నిరంతరం చదివించేందుకు అన్ని వసతులను కలిపించి, వారి విజయానికి కారకులైన శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయంలో భాగస్వామి అయిన ప్రిన్సిపాల్ వి.టి.శ్రీనివాస్ మరియు అధ్యాపక బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు

SHARE

LEAVE A REPLY