విశాఖలో చంద్రబాబును అడ్డుకోవడం దుర్మార్గం-మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ!!

0
177

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-విశాఖపట్నంలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో వెంకటగిరిలో టిడిపి శ్రేణులు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం క్రాస్ రోడ్ సెంటర్లోని జాతీయ రహదారిపై టిడిపి శ్రేణుల భైఠాయించి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల మాట్లాడుతూ… రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని, నాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా నాడు టిడిపి చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, కానీ నిన్న విశాఖపట్నంలో చంద్రబాబును వైసీపీ కార్యకర్తలు, కడప రౌడీలతో అడ్డుకున్నారని ఆరోపించారు.] రాష్ట్రంలో ప్రజలు ఎంతో నమ్మి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తే, ఈరోజు రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, ప్రజలు తొందరలోనే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతారన్నారు.

SHARE

LEAVE A REPLY