గూడూరు సాయి స‌త్సంగ నిల‌యంలో ఘ‌నంగా వినాయ‌క చ‌వితి

0
649

Times Of Nellore ( Gudur ) – గూడూరు ప‌ట్ట‌ణంలో ఉన్న సాయి స‌త్సంగ నిల‌యం, మ‌రియు శ్రీ‌ విజ‌య‌దుర్గ‌ ఉప పీఠంలో వినాయ‌క చ‌వితివేడుక‌లు అత్యంత వైభ‌వంగా జ‌రిగాయి. సాయిస‌త్సంగ నిల‌యం వ్య‌వ‌స్థాప‌కులు, కోట ప్ర‌కాశం ఆధ్వ‌ర్యంలో, నిర్వాహ‌కులు కోట సునీల్ స్వామి దంప‌తులు ఆల‌యంలో మ‌ట్టి గ‌ణ‌ప‌తి విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించి, ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. వివిధ ర‌కాల ప‌త్రాలు, పుష్పాల‌తో గ‌ణ‌నాథున్ని పూజించి త‌రించారు. తొలుత గ‌ణ‌ప‌తికి వివిధ ర‌కాల సుగంధ ద్ర‌వ్యాల‌తో అభిషేకాలు నిర్వ‌హించిన కోట సునీల్ స్వామి దంప‌తులు, శాస్త్ర‌బ‌ద్దంగా పూజ‌లు నిర్వ‌హించి, వినాయ‌క వ్ర‌త క‌థ‌ను చ‌దివి భ‌క్తుల‌కు వినిపించారు. అనంత‌రం భ‌క్తుల‌కు అక్ష‌త‌ల‌తోపాటూ తీర్థ‌ప్ర‌సాదాల‌ను అందించారు. అదేవిధంగా ఆల‌యంలో హోమాల‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సాయిస‌త్సంగ నిల‌యం నిర్వాహ‌కులు కోట సునీల్ స్వామి మాట్లాడుతూ ప్ర‌తి ఏటా మాదిరిగానే ఈ ఏడాది వినాయ‌క చ‌వితిని ఘ‌నంగా నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. అంతేకాకుండా మ‌ట్టితో త‌యారు చేసిన గ‌ణ‌ప‌తిని ప్ర‌తిష్టించి పూజించామ‌న్నారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా మ‌ట్టితో రూపొందిన గ‌ణ‌ప‌తికి పూజ‌లు నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. గ‌తంలో కంటే ఈ సంవ‌త్స‌రం మ‌ట్టిరూప గ‌ణ‌ప‌తుల‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెరిగింద‌ని, ఇది మంచి ప‌రిణామ‌మ‌ని అన్నారు. ఈ పూజా కార్య‌క్ర‌మాల్లో భ‌క్తులు అధిక సంఖ్య‌లో పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY