నెల్లూరుజిల్లాలో కొనసాగుతున్న వినాయక చవితి ఉత్సవాలు

0
1463

Times of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాలో 2వ రోజు కూడా వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని అన్నీ గ్రామీణ ప్రాంతాలతో పాటూ 6 మున్సిపాల్టీలు, జిల్లా కేంద్రమైన నెల్లూరులోనూ గణనాధుడు పూజలందుకుంటున్నారు. మొదటి రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఉత్సవాలు సాయంత్రం ఉట్టి మహోత్సవాలతో యువత సందడి చేశారు. ఇక రెండవ రోజైన మంగళవారం ఉదయం వినాయకునికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. నెల్లూరునగరంలో కూడా అనేక చోట్ల అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. ఈ అన్నదాన కార్యక్రమాలను స్థానిక కార్పొరేటర్లు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ప్రారంభించారు. మరికొన్ని చోట్ల శాసనసభ్యులు కార్యక్రమాలను ప్రారంభించారు. వినాయకుడు కొలువుదీరిన మండపాలలో ప్రత్యేక ఏర్పాటు చేయడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయంతో పోలిస్తే రాత్రిళ్లు భక్తుల తాకిడి అధికంగా కనిపిస్తుంది. మొత్తానికి నెల్లూరుజిల్లాలో వినాయక చవితి వేడుకలు 2వ రోజు కూడా అత్యంత వైభవంగా కొనసాగాయి.

SHARE

LEAVE A REPLY