జిల్లాలో కరువు విలయ తాండవం చేస్తుందన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

0
134

Times of Nelore # కోట సునీల్ కుమార్‌# (Nellore) # కోట సునీల్ కుమార్ #: రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా లోని ఖరీఫ్ సీజన్లో నెలకొన్న కరువు పరిస్థితులను అధ్యయనం చేసేందుకు వచ్చిన కేంద్ర కరువు బృందం టీమ్ లీడర్ శ్రీమతి నీరజా ఆడిడామ్ గారితో ఈరోజు చరవాణిలో మాట్లాడి జిల్లాలోని కరువు పరిస్థితిని వివరించడం జరిగింది. జిల్లాలో గత మూడు సంవత్సరాల నుంచి 2016 – 17 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో కరువు విలయ తాండవం చేస్తుందని, జిల్లాలో 2016 నుంచి తక్కువ వర్షపాతం నమోదయిందిని, ఈ సంవత్సరం ఖరీఫ్ కు సంబంధించి ఇప్పటికే 46 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం జరిగిందిని, దీన్నిబట్టి జిల్లాలో ఎంత తీవ్రంగా కరువు ఉందో అర్ధం చేసుకోవచ్చు అన్నారు. మొత్తం 46 మండలాలకు గాను 21 మండలాల్లో భూగర్భ జలాలు పూర్తిగా పడిపోయాయిని, ఇప్పటికే సుమారు 100 గ్రామాల్లో ట్యాంకర్లు ద్వారా నీటి సరఫరా జరుగుతుందని, ఇంకా 200 గ్రామాలకు ట్యాంకర్లు నీటి సరఫరా చేయవలసిన అవసరం ఉందని, తాగునీటికి కూడా నీరు దొరకని పరిస్థితి ఉందని ఉదయగిరి, ఆత్మకూరు, కావాలి నియోజకవర్గల్లో పరిస్థితి అద్వాన్నముగ ఉందని ఈ జిల్లాలో సుమారు 18 వేల చేతి పంపులు ఉండగా వీటిలో చాల వరకు పనిచేయటం లేదని తక్షణమే ఆదుకోవాలని కోరారు. పశువులకు పశుగ్రాసము దొరకక గొర్రెలు, బర్రెలు , మేకలను అమ్ముకునే పరిస్థితి ఏర్పడినదని, పశుగ్రాసము రైతులకు పూర్తి సబ్సిడీ మీద అందేటట్లు చూడాలని కోరారు. జిల్లాలో కరువుతో అల్లాడుతుంటే అరకొరగా పండిన పంటకు గిట్టుబాటు దార లేక రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారని, పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అలాగే పప్పు దాన్యాలకు కూడా కనీస మద్దతు దార దొరకట్లేదని ఉదాహరణకు కంది పంటకు msp 5250 /- per quintal రావాల్సి ఉండగా రైతుకు మద్దతు ధర దొరకక నష్టపోతున్నారు. అలాగే ప్రధాన మంత్రి ఫసల్ యోజన మార్గదర్శకాలను మార్చవలసిన అవసరముందని ఏరైతు పంట నష్టపోతారో తక్షణ సహాయముగా రైతుకు 25 % మొత్తము పెట్టుబడుల్లో 24 గంటల్లో నష్ట పరిహారము అందె విధంగా చూడాలని, లేకపోతే రైతులు తీవ్రముగా నష్ట పోతారని తెలియజేసారు. ఈ అంశములకు సంబంధించి తన కార్యాలయ ప్రతినిధి ద్వారా లేఖను పంపుతున్నట్లు, అన్ని అంశాలను పరిశీలించి జిల్లాను ఆదుకోవాలని కోరినట్లు, అందుకు గాను కేంద్ర కరువు బృందము టీమ్ లీడర్ శ్రీమతి నీరజా అడిడామ్ గారు సానుకూలముగా స్పందించినట్లు క్షేత్ర పర్యటనలో పరిస్థితులను అధ్యయనము చేసి జిల్లాకు సాయం అందేటట్లు చేస్తామని తెలిపినట్లు ఎంపీ గారు ఒక ప్రకటనలో తెలిపారు.

SHARE

LEAVE A REPLY