బీర్ బాటిల్‌తో గొంతు కోసుకున్న యువకుడు

0
463

Times of Nellore (A S Pet\Nellore) # కోట సునీల్ కుమార్ # – మతిస్థిమితం లేని యువకుడు బీరు బాటిల్‌తో గొంతు కోసుకున్న ఘటన ఏఎస్ పేటలో జరిగింది. హైదరాబాద్‌ చాంద్రా యణగుట్టకు చెందిన మహ్మద్‌ హుస్సేన్‌ తన కుమారుడు ముజఫర్‌ హుస్సేన్‌కు మతిస్థిమితం లేకపోవడంతో రెండురోజుల క్రితం ఏఎస్ పేటకు తీసుకువచ్చి వదిలివెళ్లాడు. శుక్రవారం మధ్యా హ్నం బీరు బాటిల్‌ తీసుకుని గొంతు కోసుకోగా రక్తస్రావమైం ది. అలాగే బస్టాండ్‌ సెంటర్‌లో సంచరిస్తుండగా స్థానికులు ఏమైందని అడగ్గా నలుగురు వ్యక్తులు పట్టుకుని గొంతుకోసి పరారయ్యారని, తన తండ్రి గొంతు కోశాడని, తానే కోసుకున్నానని నిమిషానికి ఒక మాట చెబుతుండటంతో పోలీసులకు, 108కు సమాచారం అందించా రు. గంటైనా 108 రాకపోవడంతో ఎస్‌ఐ వీరనారాయణ, సిబ్బంది ముజఫర్‌ను ఆటోలో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముజఫర్‌ తండ్రిని ఫోన్‌లో సంప్రదించగా తాను హైదరాబాద్‌లో ఉ న్నానని మతిస్థిమితం లేక సైకోలా ప్రవర్తిస్తుండటంతో రెండురోజుల క్రితం ఏఎ్‌సపేటలో విడిచిపెట్టి వెళ్లానని చెప్పారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

SHARE

LEAVE A REPLY