ఉదయగిరి నియోజకవర్గ కాంగ్రెస్ సమావేశం

0
500

Times of Nellore (Udayagiri) # కోట సునీల్ కుమార్ # – నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జీ చెంచెలబాబు యాదవ్ తెదేపా తీర్ధం పుచుకోవడంతో ఉదయగిరి నియోజకవర్గం లోని 8 మండలాల కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు,P.C.C సభ్యులు,మాజీ M.P.P,కార్యకర్తలు కలసి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చేవూరు. దేవకుమార్ రెడ్డి గారితో అత్యవసర సమావేశం నిర్వహించారు. చెంచెలబాబు యాదవ్ కాంగ్రెస్ పార్టీని వీడి తెదేపాలో చేరడంతో ఉదయగిరి నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులు అగ్రవ్యక్తం చేసారు. ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరూ రాజకీయ చైతన్యం కలిగిన వారని, పూటకొక్క పార్టీ మారే నాయకులకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో అనేక పెద్ద పెద్ద పదవులు అనుభవించి మంచి గుర్తింపు పొంది పార్టీని వీడటం చాలా దుర్మార్గం అని, తామంతా కేవలం కాంగ్రెస్ పార్టీ కోసమే తప్ప తమ స్వార్థం కోసం పార్టీ ఫిరాయించే నాయకుల కోసం కాదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా తామంతా చెంచెలబాబు యాదవ్ నాయకత్వంలో పార్టీని ప్రజల్లో బలపరిచే దిశగా కృషి చేశామని,ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆయన అనుచరుల్ని,కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని,కాంగ్రెస్ అభిమానుల్ని విస్మరించి కనీస విలువల్ని పాటించకుండా తెదేపా లో చేరడం దురదృష్టకరమన్నారు. జిల్లాలో నూతనంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పదవీ భాధ్యతలు చేపట్టిన చేవూరు.దేవకుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని, ఆదిశగా దేవకుమార్ రెడ్డి గారి నాయకత్వంలో 8 మండలాల మండలాధ్యక్షుల సమ్మతితో ఉదయగిరి నియోజకవర్గ అభ్యర్థిగా మరో క్రొత్త అభ్యర్థిని నియమించుకోవడం జరిగిందని తెలిపారు.

చేవూరు. దేవకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉదయగిరిలోని అన్ని మండలాల మండలాధ్యక్షులు,వివిధ స్థాయి నాయకులకు,కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఎవ్వరికీ పక్షపాతి కాదని రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్ పార్టీని గెలిపించి బలోపేతం చేసేందుకు ప్రతిఒక్కరు ప్రజల్తో మమేకమై కాంగ్రెస్ పార్టీ విజయసాధనకు కృషి చేయాలని, మండలాల్లో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

ఈ సమావేశం లో జలదంకి మండల అధ్యక్షుడు D.శివ శేఖర్ రెడ్డి, P.C.C.సభ్యులు M.రాజగోపాల్ రెడ్డి,రమేష్,బాలయ్య, మండలాధ్యక్షులు B.చెన్నా రెడ్డి,T. వెంకటేశ్వర్లు యాదవ్,సుందరం,D.చంద్ర మౌళేశ్వర్ రెడ్డి, పెద్దపల్లి.హైదర్ ఆలి, మాజీ M.P.P బాల అంకయ్య, SC సెల్ అధ్యక్షుడు హజరతయ్య తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY