పచ్చని పొలాల్లో ఏరులై పారిన రక్తం – ముగ్గురిని నరికి చంపిన గ్రామస్తులు

0
1536

Times of Nellore ( Kaligiri ) – ప్రశాంతంగా ఉండే ఆ పల్లె హత్యలతో అట్టుడికింది. నీళ్లు పారాల్సిన పొలంలో రక్తం ఏరులై పారింది. పొలం తగాదాల్లో ముగ్గురు వ్యక్తుల్ని నరికిపడేశారన్న దారుణం జిల్లాలో కలకలం రేపింది. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం, పాపన ముసిలిపాలెం గ్రామంలో ఈ దారుణం జరిగింది. నెల్లూరు నగరంలో నివాసం ఉండే బేల్దారి మేస్త్రీ సానా మహేందర్ రెడ్డి (37), సెంట్రింగ్ పనిచేసే కొండ్రెడ్డి సుబ్బారెడ్డి (43) కలిగిరి మండలం పాపన ముసిలిపాలెంలో కొంతకాలం క్రితం పొలాలు కొనుగోలు చేశారు. అయితే స్థానికులు కొంతమందితో ఈ పొలాల విషయంలో గొడవలు జరిగాయి. ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకునే వరకు వెళ్లాయి. తాజాగా ఈరోజు పొలంలో చెట్లు కొట్టించి చదును చేసేందుకు మహేందర్ రెడ్డి, కొండ్రెడ్డి సుబ్బారెడ్డి పాపన ముసిలిపాలెం వెళ్లారు. సుబ్బారెడ్డి(47) అనే మరో వ్యక్తి కూడా వీరితో ఉన్నారు. ఈనేపథ్యంలో స్థానికులు వీరితో గొడవకు దిగారు. అప్పటికే కారం, కత్తులతో సిద్ధంగా ఉన్న ప్రత్యర్థి వర్గం మహేందర్ రెడ్డి, సుబ్బారెడ్డిపై దాడికి దిగింది. కళ్లలో కారం చల్లి, కత్తులతో దాడికి దిగారు. ఈ దాడిలో నెల్లూరు నుంచి వెళ్లిన ముగ్గురూ పొలంలోనే చనిపోయారు. అనంతరం నిందితులు నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయారని సమాచారం.

SHARE

LEAVE A REPLY