జగన్ ముఖ్యమంత్రి కావాలని అమీన్ పీర్ దర్గా లో ప్రార్ధనలు

0
495

Times of Nellore (Udayagiri) # కోట సునీల్ కుమార్ #-  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని, మేకపాటి రాజమోహన్ రెడ్డి. పార్లమెంటు సభ్యులు గా, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మరియు మేకపాటి గౌతమ్ రెడ్డి , ఇద్దరు శాసనసభ్యులు గా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అఖండమైన మెజారిటీతో గెలుపొందాలని, ఉదయగిరి ఎంపిటిసి షేక్ ముర్తుజా హాసన్ గారు వారి అనుచరులు ఈ రోజు శుక్రవారం సందర్భంగా కడప పెద్ద దర్గా లో నమాజ్ చేసి , శ్రీ శ్రీ శ్రీ అమీన్ పీర్ బాబా దర్గాలో ఉదయగిరి ముస్లిం మైనారిటీ సోదరులు ప్రార్ధనలు చేశారు. ఉదయగిరి లో నీటి సమస్యల నుండి ప్రజలను రక్షించాలని స్వామి వారికి పూజలు చేసారు . గతంలో 2012 ఉప ఎన్నికల అప్పుడు కూడా ఇదేవిధంగా ప్రార్ధనలు చేసాము, ఆ స్వామి వారు కరుణించారు. ఇప్పుడు మరలా అదేవిధంగా మా మేకపాటి సోదరులు అత్యదిక మెజారిటీ తో విజయం సాధించి వైఎస్ జగన్ సీఎం కావాలని కోరుకుంటు న్నామని . గెలిచిన తరువాత తిరిగి 5 లారీ ల్లో వచ్చి స్వామి వారికి మొక్కు తీర్చుకొంటామని, కోరుకున్నారు . 2012 లో రెండు లారీ లలో వచ్చి మొక్కు తీర్చుకున్నామని అన్నారు. దర్గా ను సందర్శించి న వారిలో ఖాజా మొయన్ ,లతీష్. సలామత్ మహబూబ్ బాషా తదితరులు వున్నారు.

SHARE

LEAVE A REPLY