దుత్తలూరులో రోడ్డు ప్రమాదం భార్యా భర్త దుర్మరణం

0
1497

Times of Nellore ( Duttalur ) – నెల్లూరుజిల్లా, దుత్తలూరు మండలం, నందిపాడు సెంటర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న భార్యభర్త దుర్మరణం చెందారు. వివరాల్లో కెళ్తే …. కడప జిల్లా, మాచేపల్లికి చెందిన రవీంద్రరెడ్డి, శ్రావణి దంపతులు 5ఏళ్ల కుమారుడితో కలిసి వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాల్లో పాల్గొనేందుకు నందిపాడు వచ్చారు. ఉత్సవాలు ముగింపు అనంతరం వారు బైక్ పై మాచేపల్లికి వెళ్తుండగా, నందిపాడు సెంటర్ లో ఆర్టీసీ అద్దె బస్సు వారి బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్యా,భర్త తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. వారి 5 ఏళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో భార్యాభర్త మృత్యువాత పడటంతో మాచేపల్లి గ్రామంలో విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.

SHARE

LEAVE A REPLY